బయటపడుతున్న హెడ్ కానిస్టేబుల్ బాగోతాలు

by Naveena |
బయటపడుతున్న హెడ్ కానిస్టేబుల్ బాగోతాలు
X

దిశ నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లవెల్లి రోడ్డు సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ గౌడ్ వాహనదారులపై బూతులతో రెచ్చిపోయాడు. ఈ ఘటన పై దిశ దిన పత్రికలో మంగళవారం సాయంత్రం ఏందిరా మాట్లాడేది..తంతా నడువ్.. అనే శీర్షికనా డైనమిక్ లో కథనానికి ప్రచురించారు. దీంతో బుధవారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన భాధితులు దిశను సంప్రదిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఇచ్చిన టు విలర్ వాహనం తీసుకొని ఆ మండలంలోని వైన్ షాప్ లో కూర్చుని హల్చల్ చేశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తనపై ఆ మండల ప్రజలు, జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నత అధికారులు విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మండల ప్రజల కోరుతున్నారు.

Advertisement

Next Story