- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాజెక్టుల నిర్మాణంలో తప్పులు జరగడం సహజం: మాజీ ఎంపీ వినోద్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాజెక్టుల్లో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో చిన్న తప్పులు జరగడం సహజం అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. కమీషన్లు ఏం చేస్తాయని ప్రశ్నించారు. ఆ కమీషన్లు అన్నం పెట్టవు అన్నారు. ఎస్సారెస్పీ పేస్-1,పేస్-2కు నీళ్లు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అన్నారు. రైతులకు యాసంగి పంట ముఖ్యమైనదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీచేతిలో నిర్ణయం ఉందని ప్రభుత్వం అంటోందన్నారు.
డ్యామ్ సేఫ్టీ చట్టంలో ఎక్కడా ప్రాజెక్టు రిపేర్లు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని లేదన్నారు. వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అయ్యాయన్నారు. రైతుల యాసంగి పంటకు చివరి తడి నీళ్లు ఇవ్వలేనిపరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సూచనలుచేసే అధికారం మాత్రమేఉందని స్పష్టం చేశారు. వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదన్నారు. రిక్టర్ స్కేల్ పై 5 .3 భూకంపం వచ్చినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్మిక విభాగం నేత రూప్ సింగ్ పాల్గొన్నారు.