- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYDERABAD BOOK FAIR : ఈనెల 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
దిశ, వెబ్ డెస్క్ : పుస్తక ప్రియులు ప్రతి సంవత్సరం ఎంతోగానో ఎదురూచూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్(Hyderabad Book Fair) డిసెంబర్ 19వ తేదీన ప్రారంభం కానుంది. ఇందిరాపార్క్(Indirapark) సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium)లో ఈ నెల 19 నుంచి 29వ తేదీ వరకు 37వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన జరనుందని హైదరాబాద్ బుక్ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ యాకూబ్(Shake Yakub) ప్రకటించారు. ఈ 37వ పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఆహ్వానించినట్లు తెలిపారు. బుక్ ఫెయిర్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 210కి పైగా ప్రచురణకర్తలు, పంపిణీదారులు తమ పుస్తకాలను ప్రదర్శించనున్నట్టు తెలియ జేశారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, సంస్కృతం, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషాకు సంబంధించిన పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్‌లో లభ్యమవుతాయని వివరించారు. పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని బుక్ ఫెయిర్ సోసైటీ సూచించింది. గతంలో పుస్తక ప్రదర్శన కేవలం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఉండేదని.. ఈసారి మాత్రం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనలో కేంద్ర సాహిత్య అకాడమీ కూడా భాగస్వామ్యమవుతున్నట్టు సమాచారం. ఇక.. బుక్ ఫెయిర్ ప్రాంగణం పేరును దాశరధి కృష్ణమాచార్యగా.. సభా కార్యక్రమాల వేదికను బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికను.. తోపుడుబండి సాధిక్ పేర్లతో నామకరణం చేసినట్లు తెలిపారు.