- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Family Survey: రాష్ట్రవ్యాప్తంగా 95.1 శాతం సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సంబంధించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Family Survey) రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95.1 శాతం పూర్తి అయ్యింది. నవంబర్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇండ్ల జాబితా నమోదు(హౌస్‌లిస్టింగ్) కార్యక్రమం చేపట్టిన సిబ్బంది ప్రతి జిల్లాలోనూ సమగ్రంగా సేకరిస్తు వస్తుస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో సుమారు 90 శాతం వరకు పూర్తి కాగా, ఇతర జిల్లాలలో దాదాపు 99 నుండి వంద శాతం వరకు పూర్తి కావడం విశేషం. రైతులు(Farmers), మధ్యతరగతి వాసులు(Middle class people) గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కవ సంఖ్యలో ఉండడంతో ప్రభుత్వం తమకు ఏమైనా సహాయం అందిస్తుందేమోనన్న ఆశ వారిలో ఉంటే.. రాజధాని హైదరాబాద్(HYD)లోని రియల్టర్లు(Realtors), వ్యాపారులు(Traders) కొందరు కొంత మేరకు సర్వేలో తక్కువగా పాల్గొంటున్నారు. దీంతో ఇక్కడ సర్వే 90 శాతం వరకే జరిగింది.
ఈ సర్వేలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం పేర్లను కోడ్ రూపంలో సేకరిస్తారు. వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా హౌస్ లిస్టింగ్‌లో నమోదు చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తు వస్తోంది. ఇప్పటికే శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ వివరాలను సేకరిస్తూ వస్తున్నారు. ఈ సర్వేకు సంబంధించి 75 ప్రశ్నలతో ఫార్మాట్ తయారు చేసిన ప్రభుత్వం రెండు పార్టులుగా ప్రశ్నలు వేస్తున్నారు. పార్టు-1లో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, చదువు పలు వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. ఇక పార్టు-2లో కుటుంబ ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతున్నారు. కాగా ఒక్కోక్క ఎన్యూమరేటర్ కు 150 ఇళ్లు కేటాయించారు. సర్వే చేసే వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల సిబ్బంది ఉన్నారు. సర్వే లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఆదివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో కూడా పని చేస్తుండడందో సర్వే వేగంగా సాగుతోంది.
కుటుంబ సర్వే వివరాలు ఇవీ:
కుటుంబ సర్వే ఇప్పటి వరకు 95.1 శాతం పూర్తి కాగా ఆదిలాబాద్, జనగామ, ములుగు, ఖమ్మం , నాగర్‌కర్నూలు , నారాయణపేట జిల్లాలో వంద శాతం సర్వే పూర్తీ కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో89 .8 శాతం, సంగారెడ్డి జిల్లాలో 88. 2 శాతం, జీహెచ్ఎంసీ పరిధిలో 84.4 శాతం మాత్రమే కాస్త తక్కువ స్థాయిలో నమోదు పూర్తి చేశారు. అయితే ఇతరజిల్లాలలో మాత్రం 90 నుండి 99 శాతం వరకు నమోదు కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం ఈ సర్వేను ఎప్పటికప్పుడు డిజిటలైజ్చేస్తోంది. ఇది కూడా పలు జిల్లాల్లో వేగంగా సాగుతోంది. ఆదిలాబాద్, జనగామ, ములుగు జిల్లాలలో 100 శాతం డిజిటలైజ్ కాగా.. జీహెచ్ఎంసీలో 14.2 శాతం, సంగారెడ్డిలో 83.2 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 87.7 శాతం డిజిటలైజ్ చేశారు. ఈ సర్వేను త్వరలోనే వంద శాతం పూర్తి చేసే దిశగా అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు.