- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
32 మంది నర్సులకు టామ్‌కామ్ ద్వారా జపాన్‌లో ఉద్యోగాలు
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్‌కామ్ సంస్థ మొదటి రెండు బ్యాచ్‌లకు చెందిన 32 మంది నర్సులను జపాన్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో విజయవంతంగా నియమించింది. మొదటి రెండు బ్యాచ్‌ల నుండే ఈ స్థాయిలో ఉద్యోగాలు రావడంతో త్వరలోనే మూడవ బ్యాచ్కోసం అభ్యర్థుల ఎంపిక కోసం డిసెంబర్13న హైదరాబాద్ విజయనగర్‌లోని ఐటిఐ మల్లేపల్లి క్యాంపస్‌లో డైరెక్ట్ వాక్ ఇన్ఇంటర్వులను నిర్వహించనుంది . వయే పరిమితి 19 నుండి 30 సంవత్సరాల వరకు ఉండి ఆయా నమోదిత కళాశాలల నుండి డిప్లొమా, పారమెడికల్,ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తు పని అనుభవం అవసరం లేదని అయితే జపాన్‌లో వృత్తిపరమైన నైపుణ్యాలను ఎంపికైన అభ్యర్థులకు ఉండాల్సి ఉంటుందని తెలిపింది. ఎంపికైన ఉద్యోగులకు నెలకు రూ. లక్షన్నర నుండి లక్ష 80 వేల వరకు వేతనం ఉంటుందని టామ్‌కామ్ తెలిపింది. మరింత సమాచారం కోసం ఫోన్9704570248లో గానీ, లేదా 944005208లో గానీ సంప్రదించాలని వెల్లడించింది.