పట్టు పితాంబరంలో కొత్త డిజైన్..రాజన్న సిరిపట్టుతో ప్రత్యేకమైన గుర్తింపు

by samatah |
పట్టు పితాంబరంలో కొత్త డిజైన్..రాజన్న సిరిపట్టుతో ప్రత్యేకమైన గుర్తింపు
X

దిశ,సిరిసిల్ల : కార్మిక ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా చిహ్నంగా చీరనేయాలన్న ఉద్దేశంతో 18 రోజులు డిజైన్ చేసి, నేయడానికి 23 రోజులు,మొత్తం దాదాపు రెండు నెలలు శ్రమించి,వెండి పోగులు పట్టు దారంతో చేనేత మగ్గంపై ఈ చీరను నేశాడు ప్రముఖ చేనేత కళాకారుడు వెల్డంది హరిప్రసాద్.ధార్మిక క్షేత్రమైన వేములవాడ,కార్మిక క్షేత్రమైన సిరిసిల్లను తలపించే విధంగా చీర రెండు పక్కల బాడర్లో వేములవాడ కమాన్ చిత్రాన్ని 108 సార్లు వచ్చే విధంగా,కమాన్ చిత్రంలో ఉన్న సింహం,నెమలి బొమ్మలను 108 సార్లు వచ్చే విధంగా చీరను రూపొందించాడు.చీర పాళ్లలో కమాన్లు (కాకతీయ తోరణాలు) 56,సింహాల బొమ్మలు 56, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రత్యేక మొక్కు అయిన కోడె మొక్కు విధానాన్ని ఎనిమిది సార్లు వచ్చే విధంగా చీరను తయారు చేశాడు హరిప్రసాద్.అంతేకాకుండా కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల నేతపని ఉట్టిపడేలా నూలు వాడుతున్న విధానం బుట్టా రూపంలో 280 సార్లు వచ్చే విధంగా చిత్రీకరించాడు.723 గ్రాములు బరువు గల ఈ చీరలో 226 గ్రాముల వెండి పోగులు పట్టు దారం 497 గ్రాముల నీలపు పట్టు పోగులతో బోలా శంకరుని నీలపు రంగులో ఉట్టిపడేలా తయారు చేయడం ఈ చీర మరో ప్రత్యేకత.పోచంపల్లి,గద్వాల్,నారాయణపేట్,సిద్దిపేట ఇలా ప్రతి ఊరుకో ప్రత్యేకమైన చీర ఉన్నపటికీ,రాజన్న సిరిపట్టు పేరుతో ఈ చీరకు శాశ్వతంగా సిరిసిల్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని పలువురు ఆశిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed