- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా మొబైల్ పోయింది.. వెతికి పెట్టండి: పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు
దిశ, కరీంనగర్: ఎంపీ బండి సంజయ్ కుమార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన మొబైల్ పోయిందంటూ.. దానిని వెతికి పెట్టాలని కోరుతూ కరీంనగర్ టూటౌన్ పోలస్ స్టేషషన్ ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం ఫిర్యాదు కాపీని మెయిల్ చేశారు. ఈనెల 4న అర్ధరాత్రి నుంచి 5న తెల్లవారే సమయంలో తనను క్రైమ్ నెంబర్ 147/2023లో అరెస్టు చేసి పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని వివరించారు.
ఈ క్రమంలో 7680006600 అనే నెంబర్ మొబైల్లో వినియోగిస్తున్నానని ఇట్టి మొబైల్ ఫోన్ పోయిందని ఈ విషయం బొమ్మలరామారం తరలిస్తుండగా పోలీసు వాహనంలో ఉన్న అధికారులకు కూడా తెలియజేశానని సంజయ్ తెలిపారు ఆ తర్వాత కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 60/2023 కేసులో అరెస్టు చేసినప్పుడు కూడా తాను న్యాయవాదికికి ఫోన్ పోయిందని చెప్పానని ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ విషయాన్ని న్యాయవాదులు కూడా బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారని తనను కరీంనగర్లో కస్టడీలోకి తీసుకున్నప్పుడు మొబైల్ ఫోన్ నాతో పాటే ఉందని బండి సంజయ్ కుమార్ వివరించారు. తన మొబైల్ ఫోన్ ను ట్రేస్ చేసి వెతికి పెట్టాలని అందులో పలువురి కాంటాక్ట్స్ నెంబర్లతో పాటు ముఖ్యమైన సమాచారం ఉన్నందున మొబైల్ ను వెతికి పెట్టి ఇవ్వాలని కోరారు అయితే ఇందులో వాడుతున్న సిమ్ మాత్రం తన సోదరి డాక్టర్ సౌమ్య పేరిట ఉందని, సెక్యూరిటీ కారణాల దృష్ట్యా తాను ఆమె పేరిట ఉన్న సిమ్మును వాడుతున్నానని కూడా ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫిర్యాదులో తెలిపారు.
Also Read..