ముక్కోణపు ప్రేమ కథ చిత్రం

by Aamani |   ( Updated:2024-08-14 10:21:06.0  )
ముక్కోణపు ప్రేమ కథ చిత్రం
X

దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ముకొణపు ప్రేమ కథ చిత్రం ను తలపించేలా ఓ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సౌమ్య శ్రీ అనేే యువతి కి 2018 సంవత్సరంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి ప్రశాంత్ తో వివాహం జరగగా ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించింది. తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు జరగడం తో భర్తకు దూరంగా తన సొంత ఊరు అయిన మొలంగూర్ గ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కల్లూరి భూపేష్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడుతూ తరచూ ఫోన్లు చేసేవాడని భర్తకు దూరంగా ఉండటంతో , ప్రేమ పేరుతో భూపేష్ తనను మాయ చేయడంతో ప్రేమలో పడ్డానని తన బాధ్యత తన ఇద్దరు పిల్లల బాధ్యత భూపేష్ చూసుకుంటానని నమ్మబలకగా హైదరాబాదులోని ఓ దేవాలయంలో వివాహం చేసుకుని కాపురం చేసినట్లు తెలిపారు.

వివాహం జరిగిన నాలుగు నెలల సమయం తర్వాత ఇప్పుడు తనను తన పిల్లలను పట్టించుకోవడం లేదని భూపేష్ ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. అటు చేసుకున్న భర్త ఇటు ప్రియుడు ఇద్దరు చేతులెత్తేయడం తో దిక్కు తోచని స్థితిలో తన జీవితం ఉందని తన ప్రియుడి వద్దకు తనను చేర్చాలని బోరున విలపిస్తూ తెలిపింది.ఘటన స్థలానికి చేరుకున్న కేశవపట్నం పోలీసులు వివాహితను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపారు. ఈ సంఘటన పట్ల గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సినిమాలను తలపించేలా జరుగుతున్న సంఘటనల పట్ల ప్రజలు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed