- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరీష్ రావు నువ్వు మొగోడివి అయితే సమాధానం చెప్పు : MP ధర్మపురి అరవింద్
దిశ,జగిత్యాల ప్రతినిధి : గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కేటాయించిన 12వేల కోట్లతో ఒక్క ఇల్లు కట్టలేదని ఖాళీ ఫ్లాట్ ఉన్నోల్లకు ఒక్క రూపాయి ఇయ్యలేదని హరీష్ రావు మొగోడు అయితే వీటి మీద సమాధానం చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్‌లో ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి రైతులకు సమయానికి నీళ్ళు ఇవ్వడు కానీ మహారాష్ట్రకు నీళ్ళు ఎత్తి పోస్తడట ఈ ముసలోడు, నదులకు నదులే దానం చేశాడని ఉచిత ఎరువుల హామీ ఏమైందని ముసలోడిని తన్ని తరిమే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ మీద మండిపడ్డారు.పసుపుకు మద్దతు ధర వస్తది లెటర్ రాయమంటే రాయకపోతివి రైతుల పసుపు పంటకు భీమా రానియ్యక పోతివి పైగా అనవసర ఆరోపణలు చేస్తూ సీఎం రైతులను పక్కదోవ పట్టిస్తున్నాడు అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో నర్సింగాపూర్ రైతు జలపతి రెడ్డి ఆత్మహత్యే నిదర్శనం అని అన్నారు.కనీస పారిశుద్ధ్యం చేతకాక మాత శిశు ఆసుపత్రి ఎనిమిది మంది గర్భిణీలను బలి తీసుకుందని, హాస్టళ్లలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని ఇదంతా సీఎం కంటికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఈ పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని బిడ్డ సార దందా చేసి దొరికిందని త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది అని కానీ సీఎం అనవసర ఆరోపణలు చేస్తూ ముస్లిం లను ఎగేస్తున్నాడని ఆయన మాయలో పడొద్దు అని సూచించారు.మోడీ ఇచ్చిన ప్రతి రూపాయి మీకు అందిందని రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.