తెల్లవారితే పెళ్లి.. అక్క భర్తతో పెళ్లి కూతురు జంప్

by Shiva |   ( Updated:2023-05-08 10:21:30.0  )
తెల్లవారితే పెళ్లి.. అక్క భర్తతో పెళ్లి కూతురు జంప్
X

దిశ, జగిత్యాల రూరల్ : తెల్లవారితే పెళ్లి.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇంకాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లి కూతురు కనిపించ లేదు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులంతా కంగారు పడ్డారు. అనంతరం నవ వధువు చేసిన ఘనకార్యం తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కన్నాపూర్ గ్రామానికి చెందిన యువతిని మల్యాల మండలం లంబడిపల్లె గ్రామానికి చెందిన యువకుడుతో మే 7న పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను యువతి తరపు బంధువులు పూర్తి చేశారు. నవ వధువు కూడా అంతకు ముందు రోజు వరకు ప్రీ వెడ్డింగ్ షూట్లో ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించింది. కాగా, ఆదివారం తెల్లవారుజామున పెళ్లి కూతురు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతర ఆ పెళ్లికూతురు తన అక్క భర్తతో వెళ్లిపోయింది అని తెలుసుకు.. ఏమిటీ ఈ కలికాలం అంటూ.. అందరూ ముక్కున వేలేసుకున్నారు.

Advertisement

Next Story