- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీకో హటావో.. దేశ్ కో బచావో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి: దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందంటూ మోదీకో హటావో.. దేశ్ కో బచావో అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునచ్చారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రతిపక్షాలను కేంద్రం అనగదొక్కడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆరోపించారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అభివర్ణించారు.
రాహుల్ గాంధీ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును దేశం మొత్తం ఖండిస్తుందని తెలిపారు. అంతకు ముందు స్థానిక ఇందిరా భవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి మోదీకో హటావో దేశ్ కో బచావో అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, బండ శంకర్, కొత్త మోహన్, తటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, కల్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, నక్క జీవన్, పులి రాము, గుండా మధు, మన్సూర్, నేహాల్, చాంద్ పాషా, రఘువీర్, గోపి, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.