తడిచెత్త, పొడిచెత్తతో ఎరువులు తయారు చేస్తాం

by Nagam Mallesh |
తడిచెత్త, పొడిచెత్తతో ఎరువులు తయారు చేస్తాం
X

దిశ, జగిత్యాల టౌన్: పచ్చదనం స్వచ్ఛ ధనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. గురువారం జగిత్యాల పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం పచ్చ ధనం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పురపాలక శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తెలిపారు. పట్టణ ప్రజలు తడి పొడి చెత్త వేరు చేయడం వలన ఎరువుల తయారీ చేయవచ్చును పర్యావరణానికి హాని కలవకుండా ఉంటుందన్నాన్నారు. అలాగే పట్టణంలో పలుచోట్ల పార్కులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డి.ఎస్.పి రఘు చందన్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, కమిషనర్ సమ్మయ్య, పోలీసు సిబ్బంది, కౌన్సిలర్లు, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story