MLA Adi Srinivas : రైతును రాజుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం..

by Aamani |
MLA Adi Srinivas : రైతును రాజుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం..
X

దిశ,కోనరావుపేట : భారత దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా మారచబోతున్నం అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా , కోనరావుపేట మండల కేంద్రంలోని నిజామాబాద్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాలకు హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు డపుసప్పులతో స్వాగతం పలికారు.కార్యక్రమంలో అది శ్రీనివాస్ మాట్లాడుతూ.రైతును రాజుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అని,అందులో భాగంగానే దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రైతు రుణమాఫీ లో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర రైతన్నలకు పెద్దపీట వేసింది అని అన్నారు.

దాదాపు 11 వేల పై చిలుకు మంది రైతన్నలకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయడం జరిగింది అన్నారు.అనంతరం నిజామాబాద్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝతో పాల్గొని సచివాలయంలో ప్రారంభం చేసిన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ బండ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల చేపూరి గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా,మండల ex వైస్ ఎంపీపీ ఎల్లన్న,గొట్టే రుక్మిణి,రవీందర్,జిల్లా లంబాడీల ఐక్య వేదిక అధ్యక్షుడు బనావత్ నరేష్ ,వివిధ గ్రామాల రైతులు ,మహిళలకు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed