- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపు సిద్దిపేటలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పర్యటన
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట పట్టణంలోని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇర్కోడ్ గ్రామ శివారులోని మోడల్ స్లాటర్ హౌస్ ప్రారంభోత్సవం, కోటిలింగాల దేవాలయం వద్ద రూ.20కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, కప్పల కుంట సుంధరీకరణ పనులకు శంకుస్థాపన, ఇంటింటి తాగునీరు వసతి కొనసాగింపు పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
స్వచ్ఛ బడి పరిశీలన, స్థానిక యువతకు ఐటీ ఉద్యోగాలు అందించడమే ధ్యేయంగా రూ. 63 కోట్లతో నిర్మించిన ఐటీటవర్ ను మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కడవేర్గు రాజనర్సులు పరిశీలించారు.