ఏరియల్ వ్యూను ఎంజాయ్ చేసిన మంత్రులు

by Shiva |   ( Updated:2023-04-12 12:45:42.0  )
ఏరియల్ వ్యూను ఎంజాయ్ చేసిన మంత్రులు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల భవప ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నగరం నుంచి హెలీకాఫ్టర్ లో కార్యక్రమానికి హాజరయ్యారు.మార్గమధ్యలో ఏరియల్ వ్యూ నుంచి కాళేశ్వరం జలాలతో నిండుకుండలా ఉన్న కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను చూసి వారంతా మంత్ర ముగ్ధులయ్యారు. ఆ సుందర దృశ్యాలను మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ల ఫోన్ కెమెరాలో బంధించి, ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న పర్యావణాన్ని ఆస్వాదించారు.

Read more:

కాబోయే దేశ ప్రధాని కేసీఆర్: మంత్రి మల్లారెడ్డి

Advertisement

Next Story