ఆరోగ్య తెలంగాణ దిశగా బస్తీ దవాఖానాలు: మంత్రి గంగుల

by Mahesh |   ( Updated:2023-05-17 09:13:08.0  )
ఆరోగ్య తెలంగాణ దిశగా బస్తీ దవాఖానాలు:  మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్: పట్టణాల నుంచి పల్లెల వరకు సత్వర వైద్య సహాయాన్ని అందించి ఆరోగ్య తెలంగాణను సాదించే దిశగా బస్తీ దవాఖానాలను ఆచరణలోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుదవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పద్మనగర్‌లో 21.30 లక్షలతో ఎర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంటేనే భయపడే రోజులు ఉండేవని, ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సకల వసతులు, సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించామన్నారు. దీంతో ప్రజలకు ఏదైనా వ్యాధి వస్తే ప్రైవేటు ఆసుపత్రులకు కాదు. ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్దాం అనేలా ప్రజల్లో ప్రభుత్వ వైద్యం పై బలమైన నమ్మకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. ప్రతి 10 వేల మందికి ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానాలో ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్స్‌, ఒక నర్స్‌తో పాటు, మందులు, రోగనిర్దారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. బస్తీ దవాఖానాను ప్రారంభించిన అనంతరం మంత్రి, మేయర్‌లు వైద్యపరీక్షలను చేయించుకున్నారు. తదుపరి బస్తీ దవాఖానాను ఆనుకొని ఏర్పాటు చేసిన యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, మేయర్ వై. సునీల్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి లలితాదేవి, కార్పోరేటర్లు బోనాల శ్రీకాంత్, గందే మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, తహసీల్దార్ వెంకట్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Also Read..

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : చెవిటి వెంకన్న యాదవ్.

Advertisement

Next Story