- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో సబర్మతి నది తరువాత అంతకుమించిన అభివృద్ది ఇక్కడే జరుగుతుంది
దిశ, కరీంనగర్ టౌన్: కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలతో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా అద్భుత మహా నగరంగా వెలుగొందనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగర అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూతూ స్మితా సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పడు ముందుండి కరీంనగర్ నగర అభివృద్ధికి పనిచేశారని, వారి తోడ్పాటుతోనే ప్రస్తుతం 14.5 కి.మీ. 100 ఫీట్ల రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 3 పరిపాలన జీఓలను ప్రభుత్వం విడుదల చేయగా, కరీంనగర్ జిల్లా ఆభివృద్ది కొరకు 4వ జీఓ విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేశారు. దేశంలో సబర్మతి నది తరువాత అంతకుమించిన అభివృద్ది, అద్భుతాలతో కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులను జిల్లాలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలోని చైనా, సౌత్ కొరియా లోని సియోల్ తరువాత మన కరీంనగర్ జిల్లాలో దాదాపు రూ. 70 కోట్లతో అతిపెద్ద వాటర్ ఫౌంటెన్ ను ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.
కేబుల్ బ్రిడ్జితోపాటు డైనమిక్ లైట్ల మరియు 10x30 సైజులో పైద్ద టీవీలను బ్రిడ్జికి ఇరువైపుల ఏర్పాటు చేసుకునే పనులను మార్చి 31 లోగా పూర్తిచేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే తాజ్ వంటి మహాపరిశ్రమలు హోటల్, ఆక్వేరియం వంటివి నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయని, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తరువాత తెలంగాణలో అద్భుతమైన పర్యాటక నగరంగా కరీంనగర్ వెలుగొందుతుందని తెలిపారు. వరద ఉధృతిని తట్టుకునేలా అప్పర్, లోయర్ ప్రామినెడ్ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, పనులన్నీ పూర్తి చేసుకుని ఆగస్టులోగా ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు.
స్మితాసబర్వాల్ మాట్లాడుతూ, చారిత్రాత్మక నగరమైన కరీంనగర్ నగర అభివృద్దిలో కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలగుతామని తెలిపారు. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన మీడియన్ ఎత్తును తగ్గించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. రెసిడెన్సీ ఏరియాలు, గృహ సముదాయాలలో అందమైన మొక్కలను నాటడం, పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో ప్రధాన కూడళ్లలో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ఐడీఓసీ, ఇంటిగ్రెటెడ్ మార్కెట్ల నిర్మాణాలతో కరీంనగర్ మరింత అందంగా రూపొందనుందని, శానిటేషన్, నగర అభివృద్ది పనులను నిత్యం జరిగేలా చూడాలని సూచించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయినట్లయితే పర్యటక శోభను ఆస్వదించడానికి మహానగరాల నుండి ప్రజలు కరీంనగర్ కు దారిపడతారని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న అనేమియా ముక్త్ కరీంనగర్ జిల్లాగా చేపడుతున్న చర్యల గురించి అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణ పనుల గురుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ కు వివరించారు. కార్యక్రమంలో చివరగా కేబుల్ బ్రిడ్జిని సందర్శించి చేపడుతున్న పనుల గురించి మంత్రి, స్మితా సభర్వాల్ కు వివరించడంతోపాటు చేపడుతున్న పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ రామకృష్ణ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జట్పీ సీఈఓ ప్రియాంక, ఆర్డిఓ ఆనంద్ కుమార్, ఆర్అండ్ బీ ఈఈ సాంబశివరావు, డీఈ రవీందర్, కాంట్రాక్టర్ కమాలుద్దీన్ ఇతర అధికారులు, కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.