- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసు క్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఉండాలి
దిశ, మంథని : ప్రభు ఏసు క్రీస్తు చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్బంగా బుధవారం మంథని పట్టణంలోని ఎరుకలగూడెం బేతేలు గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చి తో పాటు సియేను ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అదే విధంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వారితో కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఎవరు ఏ దేవుడిని పూజించినా ఓర్పు సహనంతో ఉండాలని చెబుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం త్వరలో ప్రారంభించబోతున్నామని, క్రైస్తవులు, నిరుపేద కుటుంబాలకు చెందిన వారందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, కాచే శశిభూషణ్, మంథని ఎంసీపీఎఫ్ అధ్యక్షులు పాస్టర్ డేవిడ్, ఉపాధ్యక్షులు దైవ కృపాకర్, కార్యదర్శి అశోక్, సహాయ కార్యదర్శి జోషి, కోశాధికారి జయరాజ్, సభ్యులు జోసెఫ్, నవీన్, సుదర్శన్, దైవజనుల శ్రీనివాస్, పాస్టర్లు వల్లూరి ప్రభాకర్, దూడ మహేష్, కలువల సామ్యూల్, సంఘ పెద్దలు అంకరి కుమార్, మంథని ప్రసాద్, అందే రమేష్, చింతకుంట్ల ప్రేమ్ కుమార్, దాసరి సదానందం, రామగిరి కుమార్, ఈర్ల సదానందం, అంకరి ప్రకాష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.