మగతనం అంటే ఎలక్షన్‌లో గెలవడం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : కేటీఆర్

by Aamani |   ( Updated:2024-03-07 13:14:31.0  )
మగతనం అంటే ఎలక్షన్‌లో గెలవడం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : కేటీఆర్
X

దిశ,కరీంనగర్ టౌన్ : బీఆర్ఎస్ నాయ‌క‌త్వంపై వ్యాఖ్య‌లు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మ‌గ‌త‌నం అంటే ఎల‌క్ష‌న్లు గెల‌వ‌డం కాదు.. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డం అని కేటీఆర్ అన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ క‌ద‌న భేరీ సన్నాహాక స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఇవాళ్టికి 90 రోజులు అవుతుంది. మ‌రో 10 రోజులు అయితే వంద రోజులు పూర్తువు తుంది. వంద రోజుల్లో చాలా చేస్తాన‌ని రేవంత్ చెప్పారు. అధికారంలోకి రాగానే రూ. 15 వేలు రైతుబంధు వేస్తా అన్నాడు. రైతు భ‌రోసా అన్నాడు కానీ భ‌రోసా ల‌భించ‌లేదు. రైతులు మోస‌పోయి ఓట్లు వేశామ‌ని బాధ‌ప‌డుతున్నారు. కేసీఆర్ ఇచ్చే రైతుబంధు కూడా ప‌డ‌క‌పాయే క‌దా అని రైతులు అనుకుంటు న్నారు. రేవంత్‌కు రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేద‌ని రైతులు చ‌ర్చ పెడు తున్నారు.

రాష్ట్రంలో ఉండే రైతుల‌కు 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తా.. ఆ ఫైలుపై డిసెంబ‌ర్ 9న సంత‌కం చేస్తాన‌ని రేవంత్ అన్నాడు. మ‌రి ఎప్పుడు రుణ‌మాఫీ చేస్తావు..? అని కేటీఆర్ నిల‌దీశారు. మ‌గాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. ద‌మ్ముం టే, సత్తా ఉంటే, మ‌గాడివి అయితే.. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌కు రా.. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి రా.. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు.. సిరిసిల్ల ఎమ్మెల్యే ప‌ద‌వికి నేను రాజీనామా చేస్తాను.. మ‌ల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం అంటే అప్ప‌ట్నుంచి స‌డిచ‌ప్పుడు లేదు. అందుకే అంటున్నా మ‌గ‌త‌నం అంటే ఎల‌క్ష‌న్లు గెలుచుడు కాదు.. మ‌గాడివి అయితే ఇచ్చిన మాట నిల‌బెట్టుకో. ద‌మ్ముంటే మార్చి 9వ తేదీ వ‌ర‌కు రుణ‌మాఫీ చేసి చూపించు. పంట‌ల‌కు నీళ్లు ఇవ్వు.. రైతు భ‌రోసా ఇవ్వు.. మ‌హాల‌క్ష్మి కింద మ‌హిళ‌ల‌కు రూ. 2500 ఇస్తా అన్నావు.. ద‌మ్ముంటే ఈ ప‌నులు చేసి చూపించు. నోటికొచ్చిన సొల్లు పురాణం చెప్పుడు కాదు. ప్ర‌జ‌ల‌ను కించ‌ ప‌రించే విధంగా చిల్ల‌ర మాట‌లు మాట్లాడడం కాదు. ప్ర‌జ‌లు మంట మీద ఉన్నారు. కొత్త ప్ర‌భుత్వం ఆగం చేసింద‌నే కోపం మీద ఉన్నారు అని కేటీఆర్ తెలిపారు.

Advertisement

Next Story