- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంథనిలో హీటెక్కిన రాజకీయం..
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పరిస్థితి రాజకీయం వేడెక్కిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగి ఏడాది కావస్తుండగా మంథనిలో మళ్లీ రాజకీయ మంటలు చెలరేగినట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. దీనికి గల కారణం ఇటీవల కాటారం మాజీ జెడ్పీటీసీ, బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబులు గతంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై హత్య చేయడానికి తన ద్వారా కుట్ర పన్నినట్లు వీడియో లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
ఇరుపార్టీ నేతల వరుస ప్రెస్‌మీట్లు..
నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ నాయకులు చేసిన సేవలు, అభివృద్ధి గురించి వరుస సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు..
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒక్కరిపై మరొకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అదే విధంగా వాట్సాప్ గ్రూపులలో కూడా ఒక్కరి మరొకరు పోస్టులు పెడుతుండటంతో సోషల్ మీడియాలో రాజకీయం హైటెక్కుతుంది. అదే విధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. దీంతో మంథని వ్యాప్తంగా రాజకీయ మంటలు చెలరేగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మంత్రి శ్రీధర్ బాబు పరువుకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులు
మంత్రి శ్రీధర్ బాబు పరువుకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. తమ నాయకుడి హత్యకు కుట్ర పన్నారని బీఆర్ఎస్ నాయకులు కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల ఆందోళనలు, నిరసనలతో మంథనిలో రాజకీయం వేడెక్కుతోంది. ఎటు నుంచి ఎటు వైపు దారి తీస్తుందోనని నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.