- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంథని ఆర్డీఓ సరెండర్
దిశ, మంథని : మంథని ఆర్డీఓ గా పని చేసిన వి. హనుమానాయక్ ను చీఫ్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు సరెండర్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ హెచ్ఏఐ, ఎల్ ఏ కు సంబంధించిన విషయంలో కోర్ట్ ఆదేశాలను పట్టించుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యం చేసినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సరెండర్ చేసినట్లు తెలుస్తుంది.
సింగరేణికి సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కూడా ఆర్డీఓ పై ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన్ని సరెండర్ చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి ఆర్డీఓపై పలు విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరెండర్ చేయడంతో అధికారుల్లో అలజడి మొదలైంది. గతంలో మంథనిలో పనిచేసిన పంచాయతీ ఎంపీఓ ఆరిఫ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామి, ఇప్పుడు ఆర్డీఓ హనుమా నాయక్ ను సరెండర్ చేయడంతో మంథని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ఆర్డీఓగా పని చేస్తున్న బి.గంగయ్యకు మంథని ఇన్చార్జి ఆర్డీఓ బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం.
- Tags
- surrender