- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Murder: మద్యం మత్తులో స్నేహితుడి తలపై కొట్టి హత్య
దిశ, కొడిమ్యాల: మండలంలోని పూడూర్ గ్రామంలో ఈనెల 5న జరిగిన కందుల రాజశేఖర్ మర్డర్ మిస్టరీ వీడింది. స్నేహితుల మధ్య ఉన్న పాత గొడవలే హత్యకు దారి తీసినట్లుగా జగిత్యాల డీఎస్పి రఘు చందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు కొడిమ్యాల పీఎస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. గ్రామానికే చెందిన మృతుడి స్నేహితుడు మామిడి కమల్ తో పాటు అతడి బంధువు మల్యాల మండలం గొర్రె గుండం గ్రామానికి చెందిన చిలివెరి తిరుపతి ఈ హత్యకు పాల్పడినట్లుగా వివరించారు. హత్య జరిగిన రోజు రాత్రి మృతుడితో పాటు నిందితులు మద్యం సేవిస్తున్న తరుణంలో పాత గొడవలు ప్రస్తావనకు రాగా.. అది కాస్త గొడవకు దారి తీసింది. మద్యం మత్తులో కోపోద్రిక్తులు అయిన నిందితులు కమల్, తిరుపతి కర్రతో రాజశేఖర్ తలపై బలంగా కొట్టడంతో పాటు అరవకుండా నోట్లో మట్టి పోసి హత్యకు పాల్పడినట్లుగా తెలిపారు డీఎస్పీ. అనంతరం మృతుడి స్కూటీ నుండి పెట్రోల్ తీసి సాక్ష్యధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు డీఎస్పి వివరించారు. నిందితులు గురువారం కరీంనగర్ పారిపోతున్న క్రమంలో పూడూరు శివారులో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రక్తపు మరకలు ఉన్న దుస్తులతో పాటు సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. నాలుగు రోజుల్లో కేసు చేదించిన మల్యాల సిఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.