ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం వెనుకాడదు: సింగరేణి డైరెక్టర్

by S Gopi |   ( Updated:2022-12-10 15:27:42.0  )
ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం వెనుకాడదు: సింగరేణి డైరెక్టర్
X

దిశ, రామగిరి: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి ఎప్పుడు వెనకాడదని, సంక్షేమానికి అవసరమైన నిధులను కేటాయిస్తుందని సింగరేణి డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఏఎల్పీ గనిలో రూ. 14 లక్షలతో నిర్మించిన మ్యాన్ వే, రూ. 24 లక్షలతో నిర్మించిన పిట్ స్టోర్ భవనాలను టీబీజీకేస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఏ జీఎం ఎన్వీకే శ్రీనివాస్, ఆర్జీ3 జీఎం టి. వెంకటేశ్వరరావు, అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం. నరేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story