- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు భారీ షాక్... సిరిసిల్లలో...
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: ఐదేండ్ల సిరిసిల్లలో పదవి రాక.. అందరి చుట్టు తిరిగిన సదరు నేత.. అందరి సపోర్టుతో పదవి పొందాక.. వారిపైనే అజమాయిషి చేయడం, సొంత సామాజికవర్గ పారిశ్రామి వేత్తలనే వ్యక్తిగత టార్గెట్ చేసి తన పదవిని, పవర్ ను ఉపయోగించడానికి ప్రయత్నాలు ప్రారంభించడం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర వివాదస్పదమవుతుంది. ఇన్నాళ్లు సిరిసిల్లకు పదవి రాలేదని బాధపడ్డ సిరిసిల్ల వాసులే ఎందుకు ఇచ్చార్రా అనే పరిస్థితిని కొనితెచ్చుకుంటున్న సదరు నామినేట్ పోస్టు పొందిన నేత తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షల రూపాయాలు చందాలు వసూలు చేసి.. తీవ్ర విమర్శల పాలై..మంత్రి కేటీఆర్ కు చెడ్డపేరు తీసుకువచ్చిన నేతనే.. మరోసారి సిరిసిల్లలో వివాదస్పదమవుతున్నాడు.
సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు తమ బిల్లులు కోసం మంత్రి కేటీఆర్ ను, ఆర్థిక మంత్రి హరిష్ రావ్ ను కలిసినందుకు నా అనుమతి లేకుండా ఎందుకు కలిశారని వారిపై అక్కసు వెళ్లగక్కినట్లు సమాచారం. నామినేట్ పోస్టు పొంది ప్రమాణ స్వీకారం రోజున చందాలు ఇవ్వడానికి నిరాకరించిన కొంతమంది రాజకీయ నేతలను, వ్యాపారులను టార్గెట్ చేసి ముందుకు వెళ్తుండటంతో సదరు నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా పదవి పొంది..తన సొంత ప్రమాణ స్వీకారోత్సవానికి సంఘాల వద్ద చందాలు వసూలు చేయడం సిరిసిల్లలో దుమారం లేపగా పదవి వచ్చాక.. సిరిసిల్లలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమానికి తనను ఆహ్వానించాలని, తనకు సంబంధం లేని శాఖల అధికారులను ఇంటికి పిలిపించుకుని మరీ మీటింగ్లు పెట్టడం, సెస్పై ఇప్పటికి ఇంకా అజమాయిషీ చేయడం, మున్సిపల్ సమస్యలపై కొంత మంది కౌన్సిలర్లు మీటింగ్ పెట్టుకుంటే సంబంధం లేకున్నా కల్పించుకుని సమావేశాలకు వెళ్లి తలదూర్చడంతో సిరిసిల్లలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల ప్రజాప్రతినిధులను, ఇతరులను నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండటంతో సదరు నేత పదవి వచ్చాక ఇలా మారిపోయాడేంటి అంటూ అందరు చర్చించుకుంటున్నారు.
రూ. కోట్లకు పడగలెత్తి.. రెక్కల కష్టం మీద నడిచే చిన్న సంఘాల వద్ద సైతం చందాలు వసూలు చేసి ఇప్పటికే సిరిసిల్లలో విలువ తీసుకున్న వ్యక్తి.. తన అధికార దర్పంతో ఇటు అధికారులపై, సామాన్యలపై, వ్యాపారులపై తన నోటి దరుసుతనం.. అజమాయిషీ ప్రదర్శించడం సిరిసిల్లలో తీవ్ర చర్చనీయంశం అవుతుంది. ఈ అజమాయిషీ తమకు వద్దని, హైదరాబాద్ కు పరిమితం చేసేలా.. సిరిసిల్లలో ఇబ్బందులు తప్పేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ దృష్టికి సిరిసిల్లకు చెందిన కొంత నేతలు, వ్యాపారులు తీసుకెళ్లెందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సిరిసిల్లకు పదవి రావాలని కోరుకున్నాం కానీ.. ఇలా అవుతుందని తాము అనుకోలేదని పలువురు వాపోతున్నారు. ఆయనను నేరుగా విమర్శిస్తూ పెండింగ్ బిల్లులు ఎక్కడ ఆపుతాడో అనే భయంతో పలువరు సదరు నేత తీరును చూస్తూ .. ఏం చేయలేక ఉండిపోతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ వ్యవహారాలలో కూడా సదరు నేత కల్పించుకోకుండా.. చూడాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసేందుకు పలువురు కౌన్సిలర్లు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
సిరిసిల్ల సెస్ పై తప్పని అజమాయిషీ
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్)పై సదరు నామినేట్ పోస్టు నేత ఇప్పటికీ అజమాయిషీ ప్రదర్శిస్తున్నడన్న విమర్శలు వినపిస్తున్నాయి. సెస్ అధికారులకు ఫోన్ చేసి మరీ ఇంటికి పిలిపించుకుని మరీ సెస్ లో ఏం నడుస్తుంది.. ఓటరు జాబితా విషయాలు..సెస్ ఎన్నికల నేపథ్యంలో సదరు నేత తీరు వివాదస్పదమవుతుంది. అసలే నామినేట్ పోస్టు నేత పిలిస్తే రాకపోతే భౌవిష్యత్లో తమ ఉద్యోగానికి ఏం ముప్పు తెస్తాడోనని భయానికి సదరు ఇంటికి పరుగులు తీస్తున్నారు. ఏది ఏమైనా ఈ నామినేట్ పోస్టు నేతను కట్టడి చేయకపోతే సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు చెడ్డపేరు రావడం ఖాయమని పలువురు సిరిసిల్లలో చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : నేడు ఐటీ ముందుకు మల్లారెడ్డి ఫ్యామిలీ.. విద్యా సంస్థల డైరెక్టర్లు, స్టాఫ్ కూడా!!