- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్లలో నమ్మలేని నిర్వాకం... కేటీఆర్‌కు ఈ విషయం తెలిసిందనుకో....
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తంగాలపల్లి మండలం పద్మ నగర్ కు చెందిన ఓ విద్యార్థిని ఇంటి దగ్గర నుండి స్కూల్ బస్సులో ఎక్కించుకుని మార్గమధ్యంలో ఫీజు కట్టలేదని దింపెయ్యడం జరిగింది. చదువుకునే వయసులో పసి హృదయాలు ఎంత బాధ చెందుతుందో అర్థం చేసుకోని సమాజంలో ఉన్నట్లుంది. ప్రైవేట్ స్కూల్లో యజమాన్యం అధిక ఫీజులతో బాధించడమే కాకుండా మార్గమధ్యలో విద్యార్థినిని దించి అవమానపరచడం అనేది అవివేకం. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని శుభోదయం ప్రైవేటు పాఠశాల నిర్వాకమిది. విద్యార్థులు ఫీజులు కట్టడం లేదని స్కూల్ యాజమాన్యం విద్యార్థులను స్కూల్ బస్సులో నుండి దింపేస్తున్న బస్సు డ్రైవర్ కు కనికరం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న స్థానికులు ఎందుకు దింపుతున్నారని ప్రశ్నిస్తే స్కూల్ ఫీజు కట్టేంతవరకు స్కూలుకు అనుమతించారని బస్సు డ్రైవర్ తెగేసి చెబుతున్నాడు. దీంతో శుభోదయం ప్రైవేట్ స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.