ఫ్లెక్సీలో ఫొటో లేదని ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను బహిష్కరించిన డైరెక్టర్

by S Gopi |   ( Updated:2023-02-26 06:05:46.0  )
ఫ్లెక్సీలో ఫొటో లేదని ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను బహిష్కరించిన డైరెక్టర్
X

దిశ, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో శనివారం పెద్దపెల్లి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్ స్థానిక సర్పంచ్ భర్త, ఓదెల మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవికుమార్ బహిష్కరించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేసి, కేకులు కట్ చేసి అట్టహాసంగా నిర్వహించారు. అయితే ప్లెక్సీలో తన తోటి డైరెక్టర్ల ఫొటోలు పెట్టి తన ఫొటో పెట్టకుండా అవమాన పరిచినందుకు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను బహిష్కరించినట్లు రవికుమార్ దిశకు తెలిపారు. మండలంలో ఏ కార్యక్రమం జరిగినా తనను అవమానపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పదవులు లేని వారి ఫొటోలు ఫ్లెక్సీలో ముద్రించడం తనకు చాలా బాధకరమని తెలిపారు. ఈ విషయంపై ఓదెల ఎంపీపీని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులను అడుగగా సమాధానం దాటవేశారని ఆయన తెలిపారు. పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోకపోవడం మండలంలో చర్చ నీయాంశంగా మారింది.

Advertisement

Next Story