కోరుట్ల బంద్ ప్రశాంతం

by Shiva |
కోరుట్ల బంద్ ప్రశాంతం
X

దిశ, కోరుట్ల టౌన్ : జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని నిరసిస్తూ.. కోరుట్ల హిందూ సంఘాల సమితి పిలుపు మేరకు మంగళవారం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు ప్రకటించారు. ఉదయం నుంచి వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. ఈ సందర్భంగా పలువురు హిందూ సంఘాల నాయకులూ మాట్లాడుతూ.. జగిత్యాల ఆర్టీసీ బస్సులో జరిగిన ఘటనలో ఎలాంటి విచారణ లేకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. వెంటనే ఎస్సై అనిల్ పై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story