- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karimnagar: గుట్టలు మాయం.. చోద్యం చూస్తున్న అధికారులు
గట్టుదుద్దెనపల్లి-పోలంపల్లి గ్రామ శివారులోని గుట్టలు మాయమవుతున్నాయి. పెద్దపెద్ద బండరాళ్లను ధ్వంసం చేసి అక్రమంగా మట్టిని తరలిస్తుండడంతో ఆ ప్రాంతమంతా బొందల గడ్డలను తలపిస్తున్నాయి. జగిత్యాల-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. గోరంత అనుమతులు తీసుకుని గుట్టంత తవ్వేస్తున్నాడు. పట్టించుకునే వారు లేకపోవడంతో పల్లెల్లో ప్రకృతి అందాలు కనుమరుగవుతున్నాయి. ఈ క్రమంలో పెద్దపెద్ద గుట్టలను తొలిచేస్తూ మాయం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుపుతూ బొందలగడ్డగా మార్చేస్తున్నారు. ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. రాత్రింబవళ్లు మట్టిని తరలించడంతో వ్యవసాయ పొలాలు దుమ్ముతో నిండిపోతున్నాయి. దీంతో తీవ్రపంట నష్టం వాటిళ్లుతుందని స్థానిక రైతులు వాపోతున్నారు. అయితే ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోడ్లను ధ్వంసం చేస్తూ చెరువులు, నీటి కాలువలను చెరిపేస్తున్నారు.
దిశ బ్యూరో, కరీంనగర్ : జగిత్యాల-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. గోరంత అనుమతులు తీసుకుని గుట్టంత తవ్వేస్తున్నాడు. పట్టించుకునే వారు లేకపోవడంతో పల్లెల్లో ప్రకృతి అందాలను చెరిపేస్తు గుట్టలను మాయం చేస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుపుతూ బొందలగడ్డగా మార్చేస్తున్నాడు. ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. రాత్రింబవళ్లు మట్టిని తరలించడంతో వ్యవసాయ పొలాలు దుమ్ముతో నిండిపోతున్నాయి. దీంతో తీవ్రపంట నష్టం వాటిళ్లుతుంది. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోడ్లను ధ్వంసం చేస్తూ చెరువులు, నీటి కాలువలను చెరిపేస్తున్నారు.
అనుమతి గోరంత.. తవ్వకాలు గుట్టంతా..
జాతీయ రహదారి పనుల నిర్మాణం కోసం మట్టి తరలించేందుకు అనుమతులు తీసుకున్న దిలీప్ బిల్డ్ కంపనీ యాజమాన్యం నిబంధనలకు విరుద్దంగా గుట్టలను తవ్వేస్తు మట్టిని తరలిస్తున్నారు. గోరంత పర్మిషన్ తీసుకుని గుట్టంత గుల్లా చేస్తున్నారు. ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతున్నారు. మట్టి తవ్వకాలను పర్యవేక్షించాల్సిన అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు ప్రారంభం నాటినుంచి దిలీప్ బిల్డ్ కంపెనీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద అగాథమే సృష్టిస్తోంది. గతంలో వెల్లువెత్తిన ఆరోపణలపై స్పందించిన అధికారులు సదరు కంపెనీకి ఫైన్ విధించినప్పటికీ ఫైన్ కట్టించడంలో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. దీంతో కాంట్రాక్టర్ రెచ్చిపోతు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మట్టి తరలింపును నిలిపివేయాలి.. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపల్లి యుగంధర్
వరంగల్ జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణం చేస్తున్న దిలీప్ బిల్డ్ అండ్ కంపెనీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని మట్టిని తరలించకుండా ఆపాలని ప్రజావాణిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దిలీప్ బిల్డ్ కంపెనీ కాంట్రాక్టర్ యథేచ్ఛగా గత ఏడాది నుంచి గట్టుదుద్దనపల్లి, పోలంపల్లి గ్రామ శివారు నుంచి గుట్టలను గుల్ల చేస్తూ బండరాళ్లను ధ్వంసం చేసి అక్రమంగా మట్టిని జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వాడుకుంటున్నారని అన్నారు. సహజ ప్రకృతి వనరులైన గుట్టలను ధ్వంసం చేసి సింగరేణిలో ఓపెన్ కాస్ట్ తరహాలో పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తూ గుట్టలను తొలిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్ యంత్రాంగాలు పట్టించుకోకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.? అడ్డు అదుపులేకుండా గుట్టలను ధ్వంసం చేస్తన్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.