- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై నిషేదాజ్ఞలు కొనసాగింపు..
దిశ, కరీంనగర్ : సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను ఏప్రిల్ 30 వరకు పొడిగించారని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాధులు వస్తున్న నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
మద్యం సేవించి మద్యం ప్రియులు వీధుల్లో, రోడ్లపై అసభ్యపదజాలంతో మాట్లాడుతుడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించింది. మద్యంప్రియుల ఆగడాలకు కళ్ళెం వేయడంతోపాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితి పొడిగించబడే అవకాశం ఉంది. ఐపీసీ 188 హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేదాజ్ఞలు ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
డీజేలపై నిషేధాజ్ఞలు పొడగింపు
కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగం పై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను ఏప్రిల్ 30 వరకు పొడగించామని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలుగకుండా శబ్దకాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డీజె సౌండ్ వినియోగంపై నిషేదాజ్ఞలు విధించామని పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజె సౌండ్లను వినియోగిస్తున్న విషయం విదితమే.
వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ ల వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఎసీపీల అనుమతి పొందాలని సూచించారు. ఏఏ ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్లు వినియోగించాలో పరిమితులున్నాయని పేర్కొన్నారు. కమీషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు డీజెల వినియోగంపై యజమానులకు అవగాహన కల్పించడం జరిగిందని, పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితి పొడిగించబడే అవకాశం ఉంది. నిషేదాజ్ఞలు ఉల్లఘించే వారిపై ఐపీసీ 188, హైదరాబాద్ నగర పోలీసుచట్టం, ఫసలి నిబంధనలనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.