Karimnagar: ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

by Ramesh Goud |   ( Updated:2024-12-17 02:10:05.0  )
Karimnagar: ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
X

ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అంతే వేగంగా రైతుల ఖాతాల్లో డబ్బులను కూడా జమ చేస్తుంది. అయితే కొన్ని సహకార సంఘాల చైర్మన్లు, సెంటర్ల ఇన్చార్జీల తప్పిదాలతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. శంకరపట్నం మండలంలోని తాడికల్ సహకార సంఘం పరిధిలోని కరీంపేట గ్రామ రైతులు ధాన్యం విక్రయించి 15రోజులు దాటినా నేటికీ ఖాతాలో డబ్బు జమ కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు పట్టాదారు పాసుబుక్కులు సెంటర్ నిర్వాహకుడికి అప్పగించామని రైతులు వాపోతున్నారు. సెంటర్ నిర్వాహకులను రైతులు సంప్రదిస్తే మా పని మేము చేశామని, మా దగ్గర పెండింగ్ లేదని తెలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత సహకార సంఘం సిబ్బంది తగిన చర్యలు తీసుకొని రైతుల డబ్బులు ఖాతాలో జమ చేసేటట్లు చూడాలని రైతులు వేడుకుంటున్నారు.

దిశ, శంకరపట్నం : ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అంతే వేగంగా రైతుల ఖాతాల్లో డబ్బులను కూడా జమ చేస్తుంది. కానీ కొన్ని సహకార సంఘాల చైర్మన్లు, సెంటర్ల ఇన్చార్జీల తప్పిదాలతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. వివరాల్లోకి వెళ్తే... శంకరపట్నం మండలంలోని తాడికల్ సహకార సంఘం పరిధిలోని కరీంపేట గ్రామ రైతులు ధాన్యం విక్రయించి 15రోజులు దాటినా నేటికీ ఖాతాలో డబ్బు జమ కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎవరిని సంప్రదించాలో ఎవరిని కలిస్తే డబ్బులు పడతాయో తెలియక రైతన్నలు ఆందోళనలో చెందుతున్నారు. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు పట్టాదారు పాసుబుక్కులు సెంటర్ నిర్వాహకుడికి అప్పగించామని రైతులు వాపోతున్నారు. సెంటర్ నిర్వాహకులను రైతులు సంప్రదిస్తే మా పని మేము చేశామని, మా దగ్గర పెండింగ్ లేదని తెలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు, కూలీలకు చెల్లింపులు, ఇతరత్రా పెట్టుబడులకు ధాన్యం డబ్బులు రాకపోయేసరికి ప్రైవేటు వ్యక్తులను వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. ధాన్యం అమ్ముకున్న 24 గంటల్లోపే డబ్బులు ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చినప్పటికీ కింది స్థాయిలో పనిచేస్తున్న నిర్వాహకుల తీరుతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంపేట గ్రామానికి చెందిన పాలేటి చిన్న కనకయ్య, పాలేటి రాజయ్య, ఏనుగుల సంపత్, కర్రె రాజమల్లు, పాలేటి చిన్న వెంకయ్య రైతుల ధాన్యం ఓ రైస్ మిల్లుకు తరలించారు. కాగా, అప్పటికే మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మేరకు దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. కాగా, ఎక్కువ వచ్చిన ధాన్యానికి చెల్లింపుల విషయంలో సందిగ్ధం ఉన్నట్లు సమాచారం. దీంతో రైతులు డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత సహకార సంఘం సిబ్బంది తగిన చర్యలు తీసుకొని రైతుల డబ్బులు ఖాతాలో జమ చేసేటట్లు చూడాలని రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed