- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్.. అవినీతి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారా : MLC Jeevan Reddy
దిశ, జగిత్యాల ప్రతినిధి: దళితబంధు పథకం అమలులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారా అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. పట్టణంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. దళితబంధు పథకం తన ఆత్మబంధు వంటిదని చెప్పిన సీఎం కేసీఆర్ పథకం అమలులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.
అవినీతి ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని చెప్పిన కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం కేసీఆర్ పరోక్షంగా వారి అవినీతి ప్రోత్సాహించినట్లేనని ఎద్దేవా చేశారు. దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యపై ఆరోపణలు వస్తేనే పదవి నుంచి తొలగించిన సీఎం కేసీఆర్ అవినీతి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
దళితబంధు ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం కేవలం మీడియాలో ప్రకటనలతోనే పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నియోజకవ్గంలోని 1,500 మందికి లబ్ధి చేకుర్చుతామని రూ.15,700 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసి ఇప్పటికి కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇంటలిజెంట్స్ అని ఒప్పుకోవాల్సిందే..
మీ కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటే టికెట్ ఇస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమాధానమిచ్చారు. అది తన చేతుల్లో లేదని అయినా రాజకీయం అనేది ఇస్తే వచ్చేది కాదన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ తండ్రి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వారు ఇంటలిజెంట్ అని ఒప్పుకోవాల్సిందే అని తెలిపారు.