- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టుల కాల్పులు.. జవాన్లకు గాయాలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో సోమవారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 6:10 గంటలకు సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవీన్ క్యాంప్, ఎల్మగుండ సమీపంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ప్రాణ నష్టాన్ని నిలువరించినట్లు సుక్మా జిల్లా పోలీసు అధికారులు చెప్పారు. ఎల్మగుండలో ఇటీల కొత్తగా పోలీసు క్యాంప్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ రెండో బెటాలియన్ కు చెందిన హేమంత్ చౌదరి, బసప్ప, లలిత్ బాగ్ అనే జవాన్లకు గాయాలయ్యాయి. వీరికి చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. మరో వైపు సుక్మా జిల్లా పొత్కపల్లి పోలీస్ క్యాంప్ పరిధిలో 24 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయినట్టు పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 10 మంది మహిళలు కూడా ఉన్నట్టు వెల్లడించారు.