- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి.. బంధువుల ఆందోళన..
దిశ, కోరుట్ల : డాక్టర్ నిర్లక్ష్యం వల్లే జలంధర్ అనే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో గల శ్రీ గణేశ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కమ్మరి పేట గ్రామానికి చెందిన జువ్వాజీ జలంధర్ (36) అనే వ్యక్తి శనివారం జ్వరంతో మెట్ పల్లిలోని శ్రీ గణేష ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అయితే సాయంత్రం వరకు అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో బంధువులు మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా జలంధర్ అప్పటికే చనిపోయాడని ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు.
ఆగ్రహానికి లోనైన బంధువులు మృతదేహంతో శనివారం రాత్రి శ్రీ గణేశ ఆసుపత్రి ముందు బైఠాయించారు. డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ చిరంజీవి ఆసుపత్రికి చేరుకొని న్యాయం జరిగేలా చేస్తామని తెలిపినప్పటికి బంధువులు వెనక్కి తగ్గలేదు. శనివారం నుండి మృతదేహన్ని ఆసుపత్రిలోనే ఉంచి నిరసన తెలుపుతున్నారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు ఉండగా న్యాయం జరిగే వరకు మృతదేహన్ని తీసుకెళ్ళేది లేదని ఆసుపత్రి వద్దే పడిగాపులుగా ఉన్నారు. నిన్నటి నుండి సమస్య సద్దుమనగక పోవడంతో ఆదివారం గ్రామస్తులు, మృతుని బంధువులు రోడ్డు పై బైఠాయించెందుకు రాగా విషయం తెలుసుకున్న మెట్ పల్లి ఎస్సై చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకున్నారు.