- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ashok Galla- Namrata Shirodkar: మహేష్ బాబు సతీమణి నమ్రతపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన దేవకీ నందన వాసుదేవ హీరో..!
దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) మేనల్లుడైన అశోక్ గల్లా(Ashok Galla) ‘దేవకీ నందన వాసుదేవ(Devaki Nandana Vasudeva)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల(Arjun Jandhyala) దర్శకత్వంలో లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకం(Lalithambika Productions banner)పై సోమినేని బాలకృష్ణ(Somineni Balakrishna) నిర్మించారు. నిన్న (నవంబరు 12)ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి.. ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ఈవెంట్‌కు సందీప్ కిషన్(Sandeep Kishan), రానా దగ్గుబాటి(Rana Daggubati) హాజరై.. థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర యూనిట్ కు విషెష్ తెలిపారు. నవంబరు 22 వ తారీకున థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్(Shankar Pictures) దక్కించుకుంది. ఇకపోతే విడుదల నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలో ఫ్యామిలీ ప్రస్తావన రాగా.. నమ్రత అత్త నన్ను బాగా సపోర్ట్ చేసిందని తెలిపాడు.
మనం సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చామంటే ఒక హీరోగా ఎలా ఉండాలి..? ఏం చేయాలి? ఏం చేయకూడదు అని చెబుతుందని వెల్లడించాడు. హీరోగా సినీ ఇండస్ట్రీకి వద్దామనుకున్న సమయంలో జుట్టు బాగా పెంచానని అన్నాడు. అలాగే జుట్టు పెంచి పోర్ట్ ఫోలియో(ఆడిషన్ ఫొటోలు) తీయించుకుందమనుకున్నానని పేర్కొన్నాడు. ఇక చెన్నైకు వెళ్లి తీసుకుందామని అనుకునే లోపు నమ్రత(Namrata) అత్త ముంబయి వెళ్లి హెయిర్ స్టైలింగ్ చేయించుకుని ప్రాపర్ అఫీషియల్ పోర్ట్ ఫోలియో చేపించమని సలహా ఇచ్చిందని అన్నాడు. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే తన వల్లనే నేను హీరోనయ్యానంటూ అశోక్ గల్లా ఇంటర్వ్యూలో వివరించాడు.