- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ది ఉత్సవాల పేరుతో ఎన్నికల ప్రచారం.. మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతక్క..
దిశ, మెట్ పల్లి : దశాబ్ది ఉత్సవాల పేరిట అడుగంటిన తన రాజకీయ ప్రతిష్టను ఇనుమడింప చేసుకోవడానికి ప్రభుత్వం ముందస్తు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందని ఇవి దశాబ్ది ఉత్సవాలు కావని ఎన్నికల ఉత్సవాలని మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ మాజీ మెంబర్ కొమిరెడ్డి జ్యోతక్క ద్వజమెత్తారు. బుధవారం మెట్పల్లిలోని స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వెచ్చిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం బీసీలకు లక్ష సాయం మొదలుకొని, చెరువుల పండుగ, నీళ్ల పండుగ పేరిట చేస్తున్న ఆర్బాటమంతా రానున్న సార్వత్రిక ఎన్నికలలో గద్దెనెక్కి ప్రజలను మరోసారి వంచించడానికేనని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలతో పాలకులు, అధికారులు లబ్ధి పొందారే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు.
జిల్లాలోని వ్యవసాయ ఆధారిత గ్రామాలైన కోరుట్ల నియోజకవర్గంలో రైతుబంధు పేరు చెప్పి రైతులను నట్టేట ముంచారని, తాలు, తప్ప పేరిట రైతులను నిలువు దోపిడీ చేసి ఎన్నికల నిధులు సమకూర్చుకున్న ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో రైతు ఉసురు తగలకపోదని ఆగ్రహించారు. మిషన్ భగీరథ పేరు చెప్పుకొని జరుగుతున్న నీళ్ల వేడుకల పై ప్రజలు కన్నీరు కారుస్తున్నారని, త్రాగడానికి సైతం పనికిరాని మురికి నీటిని సప్లై చేస్తున్నారని, పల్లెలలో, పట్టణాలలోని వీధులలో నాసిరకమైన పైపులు వేసి పదే, పదే, రోడ్లు మరమ్మత్తులు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అవి నీళ్ల వేడుకలు కావని.. మిషన్ భగీరథ కోసం వేసిన పైప్ లైన్ నిర్మాణంలో వచ్చిన కమిషన్ల వేడుకలని అభివర్ణించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో పూర్తిగా విసిగి వేసారిన ప్రజలు రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని రాబోయేది రైతు కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.