బియ్యపు గింజపై TRS MLC ఎల్.రమణ రూపం

by GSrikanth |
బియ్యపు గింజపై TRS MLC ఎల్.రమణ రూపం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్ బియ్యం గింజపై ఎమ్మెల్సీ ఎల్.రమణ రూపాన్ని చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దానిని స్వయంగా ఎమ్మెల్సీ రమణకు మంగళవారం ఆయన నివాసంలో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా దయాకర్‌ను ఎమ్మెల్సీ రమణతో పాటు పలువురు అభినందించారు. దయాకర్ ఇంతకు మునుపు కూడా గుండు పిన్ను మొనపై సూక్ష్మ వినాయకుడి రూపాన్ని పసుపుతో తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నాడు.

Advertisement

Next Story