ఆ ప్రాంతంలో హైన సంచారం.. భయాందోళనలో ప్రజలు

by Shiva |
ఆ ప్రాంతంలో హైన సంచారం.. భయాందోళనలో ప్రజలు
X

దిశ, మల్లాపూర్: అటవీ జంతువులు బెడద ఎక్కువైపోతున్న ఘటనలు మనం తరుచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్, నడికుడ గ్రామాల మార్గ మధ్యలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారునిపై హైనా దాడికి యత్నించింది. అదే సమయంలో వెనుక వచ్చిన టాటా ఏస్ హారన్ తో హైనా పరారైంది. దీంతో ఆ ప్రయాణికుడికి ప్రాణాపాయం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు అది చిరుతగా భావించగా అధికారులు వాటి గుర్తులు ఆధారంగా అది చిరుత కాదు హైనా ఆని ధృవీకరించారు. అధికారులు స్పందించి వన్యప్రాణుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story