- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్ట్రాంగ్ రూం తాళాలు ఎలా మిస్ అవుతాయి: అధికారులపై అడ్లూరి లక్ష్మణ్ ఫైర్
దిశ, జగిత్యాల ప్రతినిధి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం తెరవాల్సిన స్ట్రాంగ్ రూం తాళం దొరకకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు స్టోర్ చేసిన వీ.ఆర్.కె ఇంజనీరింగ్ కళాశాల వద్ద అడ్లూరి మీడియాతో మాట్లాడారు. ఆరు రోజుల ముందే కోర్టు ఉత్తర్వులు రాగా, తీరా సమయానికి తాళాలు దొరకడం లేదని అధికారులు చెప్పడం వింతగా ఉందన్నారు.
కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో భద్రపరిచే స్ట్రాంగ్ రూం తాళాలు ఎలా మిస్ అవుతాయో అంతు చిక్కడం లేదన్నారు. ఇది ముమ్మాటికీ అధికారుల వైఫల్యమే అని ఆరోపించారు. గతంలో కలెక్టర్ గా పనిచేసిన శరత్ నుంచి రవి బాధ్యతలు తీసుకోగా.. ఆయన తర్వాత ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ భాషా బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్తారా లేక మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్తారా అని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఇవాళ వేచి చూస్తామని తాళం చెవి దొరకకపోతే కోర్టును ఆశ్రయించి కోర్టు సూచన మేరకు నడుచుకుంటామని తెలిపారు.
అయితే, ఆదివారం నుంచే తాళం చెవి కోసం వెతకగా దొరకకపోవడంతో తాళం పగలగొట్టాలని అధికారులు భావించారు. అయితే, లక్ష్మణ్ కుమార్ మాత్రం పగలగొట్టేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు ఐదేళ్ల తరువాత స్ట్రాంగ్ రూంను కోర్టు ఆదేశాలతో ఓపెన్ చేయాలని భావించగా తాళాలు మిస్ అవ్వడం సరికొత్త చర్చకు దారి తీసింది.