- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతులను వేధిస్తే ఊరుకునేది లేదు: CP సత్యనారాయణ వార్నింగ్
దిశ, కరీంనగర్ బ్యూరో: ఆధునిక సాంకేతికత అందరికి చేరువ అయిన క్రమంలో మోసగాళ్లు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నారని.. వారిని కట్టడి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ సీపీ వి సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ క్రైం పెద్ద ఎత్తున పెరుగుతున్న దృష్ట్యా ఈ నేరాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టనున్నామన్నారు. వచ్చే సంవత్సరం సైబర్ క్రైం కంట్రోల్ కోసం కార్యా చరణ తయారు చేసుకుని ముందుకు సాగుతామన్నారు. అలాగే లోన్ యాప్స్ విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని.. లేనట్టయితే యాప్స్ ముసుగులో జరుగుతున్న మోసాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు.
ఈ ఏడాది కూడా సైబర్ క్రైమ్స్ సంఖ్య తీవ్రంగా పెరిగిపోయిందని.. వచ్చే సంవత్సరం సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయడం కోసం ప్రజల్లో అవగాహనతో పాటు నేరస్థులను పట్టుకునేందుకు చొరవ తీసుకుంటామన్నారు. అమ్మాయిలను మోసం చేసే వారిపై మరీ కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే సోషల్ మీడియా ఆధారంగా జరిగే క్రైమ్స్‌ను ఎప్పటికప్పడు పరిశోధిస్తున్నామని.. ఇక ముందు కూడా అంతే వేగంగా వ్యవహరిస్తామన్నామన్నారు. అలాగే నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం స్మార్ట్ సిటీ నిధులతో ఈ సారి సిగ్నల్స్‌ను ఆధునీకరణ చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందించామని సీపీ చెప్పారు. వచ్చే సంవత్సరం ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరకనుందన్నారు.
ఫోర్జరీ గ్యాంగ్స్..
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూములకు సంబంధించిన వ్యవహారాల్లో నకిలీ డాక్యూమెంట్లు సృష్టిస్తూ ఛీటింగ్‌కు పాల్పడుతున్న ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఫోర్జరీ సంతకాలు పెడుతూ నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసుకుని భూ యజమానులను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇండ్లు కూల్చివేతలకు ఉపయోగిస్తున్న జేసీబీ గ్యాంగ్స్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకాడేది లేదన్నారు.
ఆదర్శవంతమైన సేవలు..
రాష్టంలో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ఆదర్శవంతమైన సేవలు అందిస్తున్నామని సీపీ వెల్లడించారు. వర్టికల్ వింగ్, షీ టీమ్స్ తదితర అంశాల్లో అందిస్తున్న సేవలు ఉన్నతాధికారుల మెప్పు పొందాయన్నారు. అలాగే 80:20 నిష్పత్తిలో పోలీసుల సేవలు అందించేందుకు కూడా కమిషనరేట్‌లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. పోలీసులు తమ విధుల కోసం 80 శాతం పని చేసే విధంగా దిశానిర్దేశం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే సంవత్సరం కూడా ఈ పనితీరును మరింత మెరుగు పర్చుకునే దిశగా ముందుకు సాగుతామన్నారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ చంద్రమౌళీ, ఏసీపీలు తుల శ్రీనివాస్ రావు, కె శ్రీనివాస్, వెంకటరెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.