- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ని చీల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు బీజేపీతో విభేదిస్తున్నట్లు కొత్త నాటకానికి తెర లేపారనీ అదే నిజం కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కి ఏటీఎంలా మారిందని పదేపదే కేంద్ర మంత్రులు ఆరోపణలు చేస్తుంటే ఎందుకు విచారణ జరిపించడం లేదని అన్నారు. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరింది అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులు ఎందుకు అవినీతిని బయటకు తీయడం లేదని ప్రశ్నించారు. ఎంత సేపు కవిత జైల్ కి పోవుడే అని ప్రజలని అయోమయం చేయడం తప్పితే బండి సంజయ్ చేసేది ఏమీ లేదని కవిత ఏజెంట్ కి 15కోట్లు ఇచ్చానని ఒక వ్యక్తి చెప్పినట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విషయం వాస్తవమా కాదా అని సీబీఐ, సీడీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.
అంతే కాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అందరికీ ఎన్నికల వ్యయం కేసీఆర్ భరిస్త అన్నాడని రాజ్దీప్ సర్డాయ్ చేసిన వాక్యలపై విచారణ జరిపి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ పార్టీ 25 కోట్లు ఇచ్చిందని ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసిన ఈటెల రాజేందర్ ఆరోపణల మీద ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ ఆస్తులు, అప్పులు ఎంత ? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎంతా అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్లేపల్లి దుర్గయ్య, నాయకులు కమటాల శ్రీనివాస్, పుప్పాల అశోక్, రాధ కిషన్, గుండా మధు, నేహల్, మహిపాల్ పాల్గొన్నారు.