చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

by Shiva |
చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్ స్టేట్ చాంబర్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. 4.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేశామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. చివరి గింజ వరకు మొత్తం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

రైస్ మిల్లుల వద్ద తూకంలో కోతలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్ మిల్లుల వద్ద 24 గంటల వ్యవధిలో ధాన్యం దిగుమతి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయాని తెలిపారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, కలెక్టర్ యాస్మిన్ భాషా, సంగీత సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story