అన్ని వర్గాలకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
అన్ని వర్గాలకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్ : అన్ని వర్గాల ప్రజలకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. రూ.88 లక్షలతో వ్యయంతో కరీంనగర్ నగరపాలక సంస్థ 12, 25, 24వ డివిజన్లో రూ.1.39 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేశారు.

వందల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు, బ్రహ్మాండమైన రోడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలు ఉండేవని మంత్రి తెలిపారు. ఇప్పుడు ప్రతి గల్లికి అధ్బుతంగా రోడ్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గతంలో ప్రక్కనే లోయర్ మానేరు డ్యాం ఉన్న ప్రజలకు నీరు అందించే పరిస్థితి లేదని, కరెంటు లేక ప్రజలు అరిగోస పడ్డారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదేళ్లలో ఫలితాలు రాష్ట్రంలో సాధించామని మంత్రి అన్నారు.

గృహలక్ష్మీ పథకం కింద భూమి ఉన్న ఆడబిడ్డలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందిన నగరాల్లో కరీంనగర్ నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్, కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మున్సిపల్ డీఈ మసూద్, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed