Former Minister KTR : తొలి సీఎం కేసీఆర్‌ పాలనలో నిండు కుండలాగా గోదావరి నది.

by Sumithra |
Former Minister KTR : తొలి సీఎం కేసీఆర్‌ పాలనలో నిండు కుండలాగా గోదావరి నది.
X

దిశ, గోదావరిఖని : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో గోదావరిఖని నది నిండుకుండలాగా ఉండేదని నేడు కాంగ్రెస్ పాలనలో ఎండిన గోదావరి దర్శనమిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఛలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం గోదావరి బ్రిడ్జి మీద ఆగి గోదావరిని పరిశీలించారు. ఎండిన గోదావరినదిని చూసి విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరుకంటి చందర్ ఏమ్మెల్యేగా ఉన్నప్పుడు తెప్పల పడవల పోటీలు నిర్వహించారని కేటీఆర్ గుర్తు చేశారు. కన్నెపెల్లి పంప్ లు నడిపితే గోదావరి నిండుకుండలా మారుతుందన్నారు.

Advertisement

Next Story