- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేలుడు శబ్ధంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామం
దిశ, కోనరావుపేట : అందరూ నిద్రలో జారుకునెలోపే ఒక్కసారిగా పేలిన శబ్దంతో ఉలిక్కిపడ్డ గ్రామం. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని, కొండాపూర్ గ్రామానికి చెందిన తుమ్మల రాములు ఇంట్లో ప్రమాదకరమైన జిలెన్స్టిక్స్ నిల్వఉంచడంతో,బుధవారం రాత్రి అవి ఒక్కసారి పేలడంతో గ్రామంలో చుట్టూ ఉన్న ఇల్లులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో రాములు బండలు పగల కొట్టడానికి, వన్యప్రానులను వేటాడడానికి వాటిని వాడేవాడిని,అయితే రాములు గత కొంత కాలంగా ఆరోగ్యం బాగలేక పక్షవాతంతో బాధపడుతూ ఇంటివద్దనే ఉంటున్నడని,గతంలో తెచ్చినవే ఇంట్లో నిలువ ఉన్నాయని,అవే ప్రమాదవశాత్తు పేలయని,కుటుంబ సభ్యులు,గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలానే కొండాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోవడంతో ఇంట్లో ఉన్న రెండు సిలెండర్ లు పేలడంతో గ్రామం భయంతో ఉలిక్కిపడింది. మళ్ళీ అలానే పెద్ద శబ్దంతో రావడంతో గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళన చెందుతున్నారు.రాములు ఇంట్లో నిల్వవుంచిన జిలెన్స్టిక్స్ పేలడంతో ఆయన ఇల్లు ధ్వంసం అయిందనీ,పెద్దమొత్తంలో పెలిఉంటే కాలనీలోని అన్ని ఇండ్లు, ద్వంసమ్ అయ్యేవని, ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదనీ,సర్పంచ్ మల్యాల దేవయ్య తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ ఐ ఆంజనేయులు వివరణ కోరగా రాములు ఇంట్లో పేలిన జిలేస్టిక్ తో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఇంకో నాలుగు జిల్లెస్టిక్స్ ఉన్నట్టు గుర్తించాం అని,బాంబ్ స్క్వాడ్ ద్వారా సోదాలు నిర్వహించి,నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం అని తెలిపారు.ఒక్కసారిగా రాత్రి వేళ పేలుడు సమిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు మరో మారు పునరావృతం కాకముందే గ్రామాల వారీగా బండలు పగలగొట్టి ,వన్య ప్రాణులు వేటాడే వారిని అప్రమత్తం చేస్తూ, పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని,ఇలాంటి పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ,మండల ప్రజలు కోరుకుంటున్నారు.