చేప పిల్లల కోసం రోడ్డు ఎక్కిన గంగపుత్రులు..

by Aamani |
చేప పిల్లల కోసం రోడ్డు ఎక్కిన గంగపుత్రులు..
X

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై గంగపుత్ర సంఘం సభ్యులు సోమవారం రోజున రాత్రి టైం లో ధర్నా చేశారు. నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టుతో పాటు చెరువులలో ఇప్పటికీ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాన కాలంలో ప్రాజెక్టు చెరువులోకి 50 శాతం నీరు రాగానే సర్వే చేసి ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం చెరువులు నిండుకుండల ఉన్నాయని నవంబర్ వచ్చిన ఇప్పటివరకు చేప పిల్లలు ఎందుకు పంపిణీ చేయలేదంటూ సీఎంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేప పిల్లల ఉచితంగా పంపిణీ చేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గంగపుత్రులకు కాకుండా ఇతర వర్గాలకు చేప పిల్లలు పంపిణీ చేశారని, మా కులవృత్తిని ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం మండల అధ్యక్షుడు కరువారి శంకర్, మండల గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story