ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట జేఏసీ ఏర్పాటు

by Shiva |
ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట జేఏసీ ఏర్పాటు
X

దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలం పాషిగాం గ్రామ శివారులో నిర్మించబోతున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పాషిగాం గ్రామంలో గురువారం ప్రజలందరూ సమావేశమై ఇథనాల్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో గౌరవాధ్యక్షుడిగా సర్పంచ్ బొప్పు తిరుపతి, అధ్యక్షుడు ఎంపీటీసీ పోడేటి సతీష్, ఉపాధ్యక్షులుగా కొత్తూరు భూమయ్య, కంటెం తిరుపతి, కంటెం మల్లయ్య తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా ఎంబడి శ్రీధర్, సహాయ కార్యదర్శిగా కాండ్రపు మహేష్, ప్రచార కార్యదర్శిగా కంటెం మధు, కోశాధికారిగా ఎంబడి చిన్న రాజయ్య, సభ్యులుగా సిరిపురం రాజలింగం, కంటెం రాజు ఉపారపు నాగరాజు, పోగుల లింగయ్య, బరుపటి జనార్ధన్, పందిగిరి రమేష్, నలిమెల తిరుపతి, ఎంబడి సాంబయ్య కంటెం సత్తయ్యలను ఎన్నకున్నారు. జేఏసీ నిర్ణయం మేరకు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం రద్దయ్యే వరకు దశల వారీగా పోరాటం సాగిస్తామని వారు పేర్కొన్నారు.

Advertisement

Next Story