- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Mid Manair Dam : మిడ్ మానేరుకు పోటెత్తుతున్న వరద నీరు.. 22 గేట్లు ఎత్తివేత..
దిశ, సిరిసిల్ల : వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుదవారం రాత్రి నుండి కుండపోత వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో చెరువులు, కుంటలు నిండి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సిరిసిల్ల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సిరిసిల్ల పాత బస్టాండ్, వెంకంపేట, సంజీవయ్యనగర్, ప్రగతినగర్, శ్రీనగర్, శాంతినగర్ కాలనీలు నీట మునిగాయి. పాత బస్టాండ్ వరకు వదర ఉదృతి ఎక్కవగా ఉండటంతో పాఫుల్లో సామాన్లు, చీరెలు, చెప్పులు, కిరాణ దుకాణాల్లో ఉన్న పప్పదినుసులు తడిసి ముద్దవడంతో వ్యాపారులకు నష్టం వాటిల్లింది. దుకాణాల్లో ఉన్న ఫర్నీచర్ తడిసి పాడైపోయాయి. మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన చిన్నబోనాల, పెద్దబోనాల, రాజీవ్ నగర్, చంద్రంపేట శివారు ప్రాంతాలలో పంట నష్టం జరిగింది. పలు కాలనీలలో ఇండ్లలో మోకాలి లోతు నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరదల్లో చిక్కకున్న ప్రజలను జేసీబీల సహాయంతో కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లపైకి భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.
తెగిన చిన్న బోనాల చెరువు కట్ట..
ఇప్పుడు 10వ వార్డు చిన్నబోనాల చెరువు తెగిపోవడంతో భారీగా వరదనీరు సిరిసిల్లను ఆవహించింది. సిరిసిల్ల పాతబస్టాండ్ నుంచి, మార్కెట్ ఏరియా, గాంధీనగర్ మీదుగా శాంతి నగర్ లో ప్రవేశించాయి. పలుకాలనీలలో భారీగా వరదనీరు వచ్చిపూర్తిగా మునిగిపోయాయి. అధికారులు అన్నిరకాల సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదనీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మిడ్ మానేరు 22 గేట్ల ఎత్తివేత..
భారీ వర్షాల నేపథ్యంలో మూలవాగు, ఎగువ మానెరూ ప్రాజెక్టులు నిండి అలుగు దుంకుతున్నాయి. దాంతో మద్యమానేరుకు భారీగా వరదనీరు పోతెట్టుతుంది. ఈ క్రమంలో 27.50 టీఎంసీ సామర్థ్యం గల మిడ్ మానేరు 19 టీఎంసీలకు చేరింది. ఎగువ మానేరు, మూలవాగు నుండి 1,05,000 కుసెక్కుల వరద నీరు మానేరుకు వస్తుండగా, ఇప్పడి వరకు 22 గేట్లు ఎత్తి 1,10572 కుసెక్కుల నీరు దిగువ మానేరుకు పంపిస్తున్నారు. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా భారీ నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. ముఖ్యంగా గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా, అలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా, గొర్రె కాపరులు, రైతులు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మిడ్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.