- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి.. ఎంవీఐ సిరాజ్
దిశ, హుజూరాబాద్ : ప్రయివేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మోటార్ వాహనముల చట్టం ప్రకారం నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంవీఐ సిరాజ్ ఉర్ రెహమాన్ సూచించారు. పలువిద్యాసంస్థల బస్సులను గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. స్కూల్ బస్సులన్నింటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్ కోసం తీసుకువచ్చిన బస్సులను స్వయంగా నడిపి కండిషన్ లేని, నిబంధనల పాటించని వాహనాలను తిప్పిపంపించామన్నారు. గడువు ముగిసిన అన్ని బస్‌లకు విధిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. ఫిట్నెస్ లేని బస్‌లు తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు.
మోటారు వాహన చట్టం ప్రకారం రిజిస్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, పన్నుచెల్లింపు రసీదు, పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్, డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. బస్సులో డ్రైవర్ ఫొటోను ఏర్పాటు చేయాలన్నారు. బస్సు అద్దాలకు గ్రిడ్ అమర్చడంతో పాటు చిన్నారులు ఎక్కేందుకు మెట్లు కిందవరకు ఏర్పాటు చేయాలి. డ్రైవర్‌కు ఐదేండ్ల అనుభవం ఉండి 60 ఏండ్ల వయసు మించకుండా చూసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. బస్సుల్లో అత్యవసర ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, సైడ్ అద్దాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.