Farmers : ఈ అరిగోస ఇంకెన్ని రోజులు..

by Sumithra |
Farmers : ఈ అరిగోస ఇంకెన్ని రోజులు..
X

దిశ, హుజురాబాద్ రూరల్ : ఒకవైపు అకాల వర్షం.. మరోవైపు ధాన్యం తడుస్తుండడం.. తూకం వేసే పరిస్థితి కంటి చూపు మేర కానరాక పోవడంతో రైతులు కల్లాల్లో అరిగోస పడుతున్నారు. ధాన్యం తూకం వేసేందుకు ఇంకెంతకాలం ఎదురు చూడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం పొలం నుంచి ధాన్యాన్ని తీసుకువచ్చి రోజు ఆరబెట్టడం సాయంత్రం కుప్పలు వేయడం, పరిపాటిగా మారిందని స్థానిక రైతులు వాపోతున్నారు. ధాన్యం దిగుమతి పై ప్రభుత్వ షరతులకు మిల్లర్లు తిరకాసు పెట్టడంతో రైతన్న ఎదురుచూపులకు మార్గం కనబడడం లేదు.

దీంతో దొడ్డు రకం దాన్యాన్ని వేసిన రైతులు పచ్చి ధాన్యాన్ని మిల్లర్లకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే 500 కు తక్కువకే విక్రయిస్తున్నారు. సన్నరకం వేసిన రైతులు ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందని ఎదురు చూడక తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కాకపోవడంతో రైతులు కల్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో, రోడ్ల పై ధాన్యాన్ని ఆరబోసి దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీ నిబంధన విధించడంతో మిల్లర్లు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. బ్యాంకు గ్యారంటీ ఎత్తివేస్తేనే కొనుగోలు చేస్తామని కరాకండిగా చెబుతున్నారు. బ్యాంకు షరతు లేకుండానే ధాన్యాన్ని అప్పగించాలని డిమాండ్ చేయడంతో రైతుల్లో నిరాశ నిస్పృహలు ఆలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed