- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nivetha Pethuraj: బెదిరింపులతో భిక్షాటన చేయడం కరెక్టేనా.. దుమారం రేపుతున్న హీరోయిన్ కామెంట్స్
దిశ, సినిమా: హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ.. ‘మెంటల్ మదిలో’, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘రెడ్’, ‘పాగల్’, ‘బ్లడ్ మేరీ’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ స్టార్‌డమ్ అందుకుంది. ఇక ఈ ముద్దగుమ్మ కేవలం హీరోయిన్‌గా కాకుండానే బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా కూడా కప్పులు కొడుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ బిచ్చగాడి వల్ల ఇబ్బంది పడిందట. ఈ విషయాన్ని స్వయంగా నివేదా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. “నేను అడయార్ జంక్షన్ దగ్గర ఆగినప్పుడు 8 ఏళ్ల పిల్లవాడు డబ్బులు అడిగాడు. అయితే ఇవ్వనని చెప్పేసరికి ఓ పుస్తకం చూపించి రూ.100 అడిగాడు. అప్పుడు సరే కదా అని రూ.100 తీసి ఇస్తుండగా ఏకంగా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బుక్ ఏమొద్దని చెప్పి 100 రూపాయలు తిరిగి తీసుకున్నాను. అయితే బాలుడు పుస్తకాన్ని కారులో విసిరేసి నా దగ్గర డబ్బులు లాక్కుని పారిపోయాడు” అని తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టింది నివేదా. అలాగే ఇలా బెదిరింపులతో భిక్షాటన చేయడం కరెక్టేనా అని ప్రశ్నించింది.